ఎన్టీఆర్ సినిమాలో న‌టించి పెద్ద త‌ప్పు చేశా: చరణ్ ఫ్రెండ్

charn frnd

జై సినిమాతో నవదీప్ హీరోగా పరిచయమయ్యాడు. రామ్ చరణ్ కి మంచి స్నేహితుడు కావడంతో నవదీప్ కి ‘ధృవ’ చిత్రంలో మంచి కేరెక్టర్ని ఇచ్చి ఎంకరేజ్ చేసాడు చరణ్. ఇక ఈ చిత్రంలో చరణ్ కి సపోర్టింగ్ కేరెక్టర్ లో నవదీప్ నటన పలువురు ప్రశంసలను అందుకుంటుంది. అయితే ఇప్పుడు ‘ధృవ’ ఇచ్చిన విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘బాద్ షా’లో చేసిన కేరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అసలు నేను ‘బాద్ షా’లో అలా విలన్ కేరెక్టర్ లో నటించకుండా ఉండాల్సిందని.. ఆ స్టోరీ విన్నప్పుడు ఆ కేరెక్టర్ తనకి మంచి పేరు తీసుకువస్తుందని భావించి ఆ కేరెక్టర్ ఒప్పుకున్నానని అంటున్నాడు. ఇక సినిమా విడుదలైనాక అనవసరంగా నేను ఈ సినిమాలో నటించానేమో అని ఫీల్ అయ్యానని అంటున్నాడు. అయితే ఆర్య 2  లో నెగెటివ్ షేడ్స్ వున్న కేరెక్టర్ లో చేసినా ఆ సినిమాలో తనకి మంచి పేరొచ్చిందని చెబుతున్నాడు. అయితే.. బాద్‌షా సినిమా సూపర్ హిట్టయితే నవదీప్ నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చి ఉండేవి కావని, వేరేలా మాట్లాడేవాడని ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు.