మహేష్‌, ఎన్టీయార్‌, చరణ్‌, అఖిల్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన చిరు

chiru stars

సినిమా వాళ్లంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని తెలిపారు మెగాస్టార్‌ చిరంజీవి. తోటి కథానాయకులందరితోనూ తనకు మంచి అనుబంధముందని, అభిమానులు కూడా విషం కక్కేలా ప్రవర్తించకూడదని చిరంజీవి హితువు పలికారు. అలాగే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతోనూ తనకు మంచి అనుబంధముందని తెలియజేశారు చిరు. తనలాగానే రామ్‌చరణ్‌ కూడా తోటి కథానాయకులందరితోనూ స్నేహంగా ఉంటాడన్నారు. మహేష్‌కు రామ్‌చరణ్‌ చాలా క్లోజ్‌ అని, మహేష్‌ కుటుంబంతో కలిసి విదేశీ టూర్‌కు కూడా చరణ్ వెళ్లాడని చిరు చెప్పారు. అలాగే ఎన్టీయార్‌ కూడా చరణ్‌కు మంచి ఫ్రెండ్‌ అని తెలిపారు. ఇక, అఖిల్‌ అయితే చరణ్‌తో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ఇంటికి వస్తుంటాడని అన్నారు. అభిమానులు కూడా హద్దులు దాటకుండా ప్రవర్తించాలని చిరు సూచించారు.