తమ్ముడైతే మాత్రం భుజం భుజం రాసుకొని తిరగాలా?

chiru tammmudu

మెగా బ్రదర్స్ మధ్య బంధంపై చిరు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి చిరు మాటల్లోనే..‘మా మధ్య బంధం దెబ్బతిందని వస్తున్న పుకార్లు బాధాకరంగా ఉంటాయి. అవన్నీ అవాస్తవం. ఈ రూమర్స్‌పై స్పందించడమే వ్యర్థం. రెండు రోజుల ముందు కూడా పవన్‌కు ఇష్టమైన కూర వండితే.. చరణ్ స్వయంగా తీసుకెళ్లి ఇచ్చాడు. ఈ విషయం బయట ఎవరికి తెలుసు? ఈ మధ్య మా తండ్రి గారి ఆర్థికానికి అందరం కలుసుకున్నాం. కలిసి భోజనం చేశాం. ఇది ఎవరికి తెలుసు? ఇష్టం వచ్చినట్లు పుకార్లు చేయడం తగదు. వీటికి స్వస్తిపలకాల్సిందే. పవన్ వ్యక్తిత్వమే అలాంటిది.. అతను అందరితో కలవలేడు. అందరం సంబరం చేసుకుంటుంటే అతను ఎక్కడో దూరంగా కూర్చుకుంటాడు. తామందరం కబుర్లు చెప్పుకుంటుంటే.. పవన్ వెళ్లి రూమ్‌లో ఉంటాడు. అది మీకు కొత్త గానీ, మాకు మామూలే. తమ్ముడు అయితే మాత్రం రోజూ భుజం భుజం రాసుకోవాలా? రోజూ కలిసిమెలసి తిరగాలా? రోజూ ఒకేవద్ద భోజనం చేయాలా? ఫంక్షన్ అయితే అందరూ అన్ని ఫంక్షన్లకు వెళ్లాలా? నేను వెళ్తున్నానా అందరి ఫంక్షన్లకి? అందరు నా ఫంక్షన్లకు ఏమైనా వస్తున్నారా? పది సంవత్సరాల తరువాత మళ్లీ తిరిగి సినిమా చేస్తున్నాను.. ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి.. ఖాళీగా ఉన్న పిల్లలందరూ వచ్చారు. పనులు మానుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాల్సిందే.’ అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పవన్‌‌తో మల్టీస్టారర్ మూవీ చేస్తారా? అని ప్రశ్నించగా.. అది జరిగే పనికాదని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లు సబ్జెక్ట్ దొరకడం కష్టమన్నారు.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..