ఇంటి బయట చీర, గాజులు పెడితే బాధేసింది

chiruu

ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరు మాట్లాడుతూ.. తొలిసారి ఈ రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా? అన్న ఆలోచన వచ్చిందని, అయితే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం అతి కొద్ది మందికే లభిస్తుందని, అలా నిజాయతీగా సేవ చేసినప్పుడు లభించే ఆనందం మాటల్లో వర్ణించలేమని అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విభజన సమయంలో అప్పటి నేతలంతా కలిసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి… రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని కోరినప్పుడు, విభజన ఆపలేమని తెలిసినప్పుడు కనీసం హైదరాబాదును యూటీని చేయండంటూ తీవ్రంగా ప్రయత్నిస్తే తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని భావోద్వేగం చెందారు. కొత్తగా యూటీ అంటాడు, అయినా వీడేం చేశాడని కొంత మంది అడిగారని, మరి కొందరు తన ఇంటి బయట చీర, గాజులు పెట్టి అవమానించారని, ఇంకొందరు కాకినాడలో అసభ్యకరమైన ఫోటోలు పెట్టి విమర్శించారని గుర్తు చేసుకున్నారు. ఇంత నిజాయతీగా ప్రజల కోసం పోరాడితే మనకు లభించే సన్మానం ఇదా? ఇలాంటప్పుడు రాజకీయాలు అవసరమా? అనిపించిందని ఆవేదన చెందారు. అలాంటప్పుడు చాలా బాధవేసిందని, గుండెను మెలిపెట్టినట్టు అనిపించిందని తన అప్పటి భావాలను ఇప్పుడు బయటపెట్టారు చిరు.