దిల్ రాజు ఐడియా అదిరింది..

dilraju idea

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘శతమానం భవతి’ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం వలన, ఈ సినిమా సంక్రాంతి ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరో విషయం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. ఆయా సినిమాల్లో టాప్ హీరోలకి సంబంధించిన కొన్ని డైలాగ్ బిట్స్ ను కట్ చేసి.. వారందరి మధ్య సంభాషణ జరిగినట్టుగా ఒక సీన్ ను క్రియేట్ చేశారట. ఈ సీన్ లో మహేశ్ బాబు మొదలు స్టార్ హీరోలంతా కనిపిస్తారని అంటున్నారు. ఈ సీన్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని దిల్ రాజు చెబుతున్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. జయసుధ – ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించారు.        

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..