‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పై రాజమౌళి రివ్యూ

gps jakkanna

డైరెక్టర్ రాజమౌళి.. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలయ్యతో పాటు చూశారు. సినిమా పూర్తి అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చిత్ర యూనిట్‌పై ప్రసంశల జల్లు కురిపించారు. ‘శాతకర్ణి’ అద్భుత కావ్యంలా ఉందని ఆయన తెలిపారు. ఈ సినిమాను 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని రాజమౌళి అన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత దర్శకుడు క్రిష్‌ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా ‘శాతకర్ణి’ చిత్రాన్ని క్రిష్‌ తెరకెక్కించారని రాజమౌళి తెలిపారు. తెలుగు చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అజరామరం అని రాజమౌళి పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..