‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మార్నింగ్ షో టాక్

gps talk

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఇవాళ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. జై బాలయ్య… జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. అమరావతిని పరిపాలించిన శాతకర్ణి జీవిత కథ ఆధారంగా కథను నమ్ముకుని సినిమా తీసే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బెన్‌ఫిట్ షో చూసిన అభిమానులు మరోసారి బాలయ్యే సంక్రాంతి హీరో అంటున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ స్పందన కూడా బాలయ్య కెరీర్‌లో ఓ మంచి సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచిపోతుందని చెబుతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయట. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఈ సినిమాలో గౌరవం దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంట్రవెల్ సీన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు తెలిపారు. అయితే నిడివి తక్కువగా ఉండటం లోటుగా అనిపించిందని సినిమాను చూసిన వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చారిత్రక నేపథ్యంలో రూపొందిన సినిమాలు కొంత నిడివి ఎక్కువగా ఉండటం సహజం. కానీ శాతకర్ణి సినిమా త్వరగా అయిపోయిందనే ఫీల్ ప్రేక్షకులకు కలిగిందట. అయితే బాలయ్య సినిమాలో నిడివిని మినహాయిస్తే మిగిలిన అన్ని అంశాలు అందంగా కుదిరాయని ప్రేక్షకులు చెప్పారు. ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య నటనకు ఎవరూ సాటిరారని చెబుతున్నారు. ఎకిమీదా, శివన్న పాటలు వీక్షకులను మెప్పిస్తాయని ప్రేక్షకులు తెలిపారు. ఇక దర్శకుడు క్రిష్ ఎప్పటిలాగానే ఒక మంచి సినిమాను అందించారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఫస్టాప్ సినిమాకు ప్లస్ పాయింట్ అని బెన్‌ఫిట్ షో చూసిన ప్రేక్షకుల టాక్. ఓవరాల్‌గా బాలయ్య 100వ చిత్రం ఆ స్థాయికి తగ్గట్టుగానే ఉందని ప్రేక్షకుల టాక్‌ను బట్టి తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..