పబ్లిక్ టాక్: ఖైదీ నెం.150

khaidi n150 public talk

ఖైదీ నెం.150 సినిమా చూసిన కామన్ ఆడియన్స్ చిరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అన్న పదాన్ని చిరు నిజం చేశారని చెబుతున్నారు. డ్యాన్స్‌ల్లో చిరు మార్క్ కనిపించిందన్నారు. ఓ పాటలో తనయుడు రామ్‌చరణ్ కూడా తళుక్కున మెరుస్తాడట. సినిమాలో వచ్చే బీజీఎమ్ ఆద్యంతం అలరించిదని చెబుతున్నారు. ఇంట్రవెల్‌లో వచ్చే ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలిచిందట. అయితే ఈ సినిమాలో కామెడీ పండలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్లు నటించినా అలరించలేక పోయారట. సందర్భం లేకుండా వచ్చే కామెడీ సీన్స్ విసుగు తెప్పిస్తాయట. రొమాంటిక్ సీన్స్ కూడా అంత చెప్పుకోదగ్గవిగా లేవని ప్రేక్షకులు చెబుతున్నారు. వినాయక్ ఈ సినిమాను నడిపించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాకు ఫస్టాప్ హైలెట్ అని ప్రేక్షకులు నొక్కి చెబుతున్నారు. అయితే కత్తి సినిమాకు, ఖైదీ నెం.150 సినిమాకు కొంత మార్పు చూపించడానికి వినాయక్ చేసిన ప్రయత్నం ఫలించలేదని సినిమా చూసిన జనం అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న మైనస్‌ల మినహా సినిమాలో ఎక్కడా తడబాటు లేదని సినిమా చూసిన కామన్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్‌కు మాత్రం పండగ లాంటి సినిమా అని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఖైదీ నెం.150 సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు సంబరాలు చేస్తున్నారు. చిరు ఖైదీ నెం.150 సినిమా సంక్రాంతికి కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..