మార్నింగ్ షో టాక్: ఖైదీ నెం 150

khaidi n150 talk

మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా? అన్న ఆయన అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చేసింది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు చేసిన ‘ఖైదీ నంబర్ 150’ అనే సినిమా గత కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా కనిపిస్తూ వచ్చింది. ఇక భారీ అంచనాల మధ్యన నేడు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన మార్నింగ్ షో టాక్ ఎలా ఉందో తెలుసుకొందాం రండి.

ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ పరంగా చూస్తే స్టోరీ లైన్ మరియు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ ఆఫ్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఇక క్లైమాక్స్ ఫైటింగ్ మైండ్ బ్లోయింగ్. డైలాగ్స్ అదరగొట్టేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు కొరియోగ్రఫీ మరింత స్మార్ట్ గా ఉన్నాయి. ఇక చిరు పర్ ఫార్మెన్స్ విషయానికి వస్తే 60 ఏళ్ల వయసున్న చిరు 25 ఏళ్ల కుర్రాడిలా నటిస్తూ ఆశ్చర్యచకితుల్ని చేశారు. వన్ మాన్ షో గా చిరు పర్ ఫార్మెన్స్ ఉంటే దీనికి తోడు కాజల్ అందాల ప్రదర్శన సినిమాకు చాలా ప్లస్ అయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన తరుణ్ అరోరా, ఐటెం సాంగ్ వేసిన లక్ష్మీ రాయ్ తమ పరిధిలో నటించి మెప్పించారు. కామియో రోల్ లో కనిపించిన చరణ్ అదరగొట్టేశాడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ లో తన తండ్రితో స్టెప్పులు వేస్తూ అభిమానులచే కేరింతలు కొట్టించాడు. ఇక దర్శకుడు వివి వినాయక్ విషయానికి వస్తే ఖైదీ నెం 150 చిత్రం రీమేక్ అనే భావన కలగకుండా ప్రతీ సీన్ ని తెలుగు ఆడియన్స్ మెచ్చే విధంగా తెరకెక్కించాడు. పైసా వసూల్ మూవీగా ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో అభిమానులకు కావలసిన అన్ని అంశాలతో పొందుపరచబడింది. చిరు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఈ చిత్రం నిలుస్తోంది. మెగా ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ కూడా ఈ సినిమా చూసి ఎగిరి గంతేస్తారు. ఇక విమర్శకులు సైతం ఈ సినిమాపై తప్పక ప్రశంసలు కురిపించాల్సిందే. తాను చెప్పినట్టుగానే మెగాస్టార్ సమపాళ్లలో అన్ని అంశాలను రంగరించి సంక్రాతి పండుగకు చక్కని వినోదాన్ని అందించేందుకు ఖైదీ నెం 150తో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డ్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో తప్పక చేరుతుందని అంటున్నారు. 2017 మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వచ్చిన ఖైదీ నెం 150 బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రతి ఒక్కరు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..