ఆ పదాన్ని చిరంజీవిని ఉద్దేశించి అనలేదు

krishh

ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఇంటర్వ్యూలోనూ క్రిష్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు.‘‘నేను ఖబడ్దార్ అన్న పదాన్ని చిరంజీవిని ఉద్దేశించి అనలేదు. నేను చిరంజీవి గారికి చాలా క్లోజ్. చరణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అల్లు అర్జున్ నన్ను నమ్మి డబ్బులు పెట్టి సినిమా చేశాడు. అంత క్లోజ్‌గా ఉండే మెగా ఫ్యామిలీకి నేనెందుకు పంచ్‌లు వేస్తాను. సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి గారిని కూడా ఆహ్వానించాం. ఆయన అభినందనలు కూడా చెప్పారు. అలాగే నేను చిరంజీవి గారి సినిమా చూస్తాను. ఆయన సినిమా చూడకుండా ఉంటానా? అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా చూస్తాను. కానీ, ట్విట్టర్‌లో ఇలా కొట్టుకోవడం ఏంటి? అది చూడగానే నాకు కాస్త భయం వేసింది. వెంటనే నాగబాబు గారికి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. రాఘవేంద్రరావు అంకుల్‌కు పరిస్థితిని వివరించాను. ట్విట్టర్ ఓపెన్ చేద్దామంటేనే సిగ్గేస్తోంది. చిరాకేస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలపై కామెంట్లు చేస్తున్నారంటే.. ఆకాశంవైపు చూసి ఉమ్మేసినట్టే. అది పోయి..పోయి మళ్లీ వారి మీదే పడుతుంది’’ అని క్రిష్ వ్యాఖ్యానించాడు. అసలు తానెందుకు ఖబడ్దార్ అనాల్సి వచ్చిందో కూడా క్రిష్ వివరించాడు. ‘‘ఇంతవరకు ఎవరూ మాట్లాడుకోని చరిత్ర గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పటికీ ఉత్తరాదిన మనల్ని మద్రాసీలు అంటారు. ఈ సినిమా వల్ల మనకు ఓ గుర్తింపు వస్తుంది. గౌతమిపుతస: శాతకర్ణహ అనే రాజు కథను.. తెరపై అద్భుతంగా తెరకెక్కించాం. ఆ ఉత్సుకతతోనే ‘బహుపరాక్’ అనబోయి ‘ఖబడ్దార్’ అని అన్నాను. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు’’ అని వివరించాడు.

కాగా, శాతకర్ణి, ఖైదీల మధ్య పోటీ లేదని, కులాల ప్రస్తావన తేవద్దని క్రిష్ అన్నాడు. కంచె వంటి సినిమాను తీసిన తనకు కులం అంటే లెక్క లేదని వివరించాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రామ్‌చరణ్ తీసిన ఖైదీ నంబర్ 150తో పాటు తన ఇంట్లో డబ్బులు పెట్టి తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో క్రిష్ ఆవేశపూరిత మాటలపై పై విధంగా చెప్పారు.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..