మహేష్ – మురుగదాస్ సినిమాలో ‘హైలైట్’ లీక్

maheshh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు.. తమిళ భాషలలో ఈ సినిమాను తెరకెక్కించి, హిందీలోను విడుదల చేయాలనే ఆలోచనలో మురుగదాస్ ఉన్నారు. కథ పూర్తిగా ముంబై నేపథ్యంలో కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థపై హీరో ఉక్కుపాదం మోపే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ తెలిపారు.

ఈ చిత్రంలోని ఇరవై నిమిషాల ఇంటర్వెల్ బ్లాక్ గురించి ఇండస్ట్రీలో కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ బ్లాక్ నిజంగానే మైండ్ బ్లాక్ చేసేస్తుందని, సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని హైప్ చేస్తున్నారు. సింహాద్రి, ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్స్ ఏ విధంగా నిలబడిపోయాయో ఇది కూడా అలా సంచనలం అవుతుందని అంటున్నారు. తన టేకింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే మురుగదాస్.. గజిని, తుపాకీ వంటి సినిమాల్లో ఇంటర్వల్ సీన్లను ఎలా ఎలివేట్ చేశాడో తెలిసిందే. మహేశ్ సినిమా కూడా వాటికి ఏ మాత్రం తీసిపోదని చెబుతున్నారు. కాగా, ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.150 కోట్ల దాకా చేస్తుందని అంచనా.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..