గౌతమీపుత్ర శాతకర్ణి పై నితిన్ రియాక్షన్

nithin gps

బాలకృష్ణ హీరోగా నటించిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఇవాళ విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానుల నినాదాలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. హీరో నితిన్ కూడా ఈ సినిమా విజయంపై స్పందించాడు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక విజయం సాధించిందని నితిన్ చెప్పాడు. నందమూరి బాలకృష్ణకు చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. క్రిష్‌, శ్రియ, రాజీవ్, చిత్ర యూనిట్ అందరికీ నితిన్ శుభాకాంక్షలు తెలిపాడు. తెలంగాణలో ఈ సినిమా నైజాం హక్కులు దక్కించుకున్నది నితిన్ కావడం విశేషం. బాలయ్యపై నితిన్ పెట్టుకున్న నమ్మకం నిజమవడమంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య సినిమా నితిన్‌పై కాసుల వర్షం కురిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..