పవన్ రాకపోవడం పై చిరు సంచలన వ్యాఖ్యలు

pawan chiru

‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ రాకపోవడం పై చిరు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తొలినాళ్ళ నుండి అలాగే ఉన్నాడని, మేమంతా హాలులో కబుర్లు చెప్పుకుంటే, వాడు ఒంటరిగా బెడ్ రూమ్ లో పుస్తకాలు చదువుకునేవాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదని, అయితే పవన్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ అభిమానులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, పవన్ బిజీగా ఉండడం వలనే ఈ వేడుకకు హాజరు కాలేకపోయాడని మెగాస్టార్ తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా పని చేసే అవకాశం లేదని, అయితే ఎప్పటికైనా పనిచేసే అవకాశం లేకపోలేదని, నాది, పవన్ ది దారులు వేరైనా గమ్యం ఒక్కటేనని అన్నారు. పవన్ ఆశయాలు బాగున్నాయని, మంచి ఐడియాలజీ ఉందని, నిజాయితీ గల మనిషి అని, ఉన్నత ఆశయం కోసం తన వంతు పని చేయాలని పవన్ భావిస్తున్నపుడు తప్పక ఆహ్వానించాలని పవన్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..