నోట్ల రద్దు తర్వాత ప్రజలకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ

sbi notes

నోట్ల రద్దు తర్వాత మొదలైన కష్టాలు మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మార్చి వరకు కష్టాలు తప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు కూడా అప్పట్లో పేర్కొన్నాయి. అయితే తాజాగా ఈరోజు ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల చివరికల్లా నోట్ల కష్టాలకు పుల్‌స్టాప్ పడుతుందంటూ తీపికబురు చెప్పారు. ఫిబ్రవరి తొలివారం నుంచే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటాయని, నెలాఖరు నాటికి పూర్తిగా సమసిపోతాయని పేర్కొన్నారు. నగదు కోసం క్యూలలో నిలబడే పరిస్థితి ఉండదని, దీనికి తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకు బ్రాంచిలకు సరిపడా డబ్బులు పంపిస్తున్నామని, దీనివల్ల ఖాతాదారులు కావాల్సినంత సొమ్మును డ్రా చేసుకోవచ్చని వివరించారు. నోట్లు మళ్లీ చలామణిలోకి వస్తాయని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు వద్దని అరుంధతి పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..