‘రెడ్‌మీ నోట్ 4’ అదిరిపోయే ఫీచర్లు ఇవే

xiaomiii

రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఈనెల 19న చైనా స్మార్ట్‌‌ఫోన్ దిగ్గజం షియోమీ విడుదల చేయనుంది. అధికారికంగా ఈ ఫోన్ విడుదలపై సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రానప్పటికీ జనవరి 19న ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఆ కార్యక్రమంలోనే ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం, లీకులను బట్టి రెడ్‌మీ నోట్‌ 4 ఫీచర్లు ఇలా ఉన్నాయి.

5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే(1920X1080 పిక్సెల్స్)

4,100 ఎంఏహెచ్ బ్యాటరీ

2 జీబీ ర్యామ్+ 16 జీబీ అంతర్గత మెమొరీ

3 జీబీ ర్యామ్ + 64 జీబీ అంతర్గత మెమొరీ

2.5డి కర్వడ్ గ్లాస్ డిజైన్

13 ఎంపీ వెనక కెమెరా

5 ఎంపీ ఫ్రంట్ కెమెరా

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఇన్ఫ్రారెడ్ సెన్సార్

6.0 మార్ష్‌మాలో

హైబ్రిడ్ డ్యూయల్ సిమ్

ధర గురించి వెల్లడించకపోయినప్పటికీ 2 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.10 వేల లోపు, 3జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.13వేల లోపు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..